తెలంగాణ
Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు విద్యార్ధులు మృతి

Road Accident: రంగారెడ్డి జిల్లా మోకిలాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మీర్జాగూడ దగ్గర కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. కారు ప్రమాదంలో నలుగురు విద్యార్ధులు మృతి చెందారు. మృతులు సూర్యతేజ, సమిత్, శ్రీ నిఖిల్ ,రోహిత్‌గా గుర్తించారు.
ప్రమాదంలో గాయపడిన మరొకరిని ఆస్పత్రికి తరలించారు. కోకాపేట్‌లో బర్త్‌డే పార్టీ చేసుకుని ఫ్రెండ్స్‌ని డ్రాప్ చేసి వస్తుండగా ప్రమాదం జరిగింది. విద్యార్ధులందరూ IBS కాలేజీలో చదువుతున్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



