తెలంగాణ
యూరియా కోసం వెళ్తున్న రైతుల ఆటో బోల్తా

యూరియా కోసం ఆటోలో వెళ్తున్న రైతులు ప్రమాదంలో చిక్కుకున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఉప్పలపాడు పీఏసీఎస్ సబ్ సెంటర్‌లో యూరియా కోసం వెళ్తున్న ఆటో బోల్తా పడింది. కంబాలపల్లి గ్రామం వద్ద ఆటో బోల్తాపడి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినపుడు ఆటోలో పది మంది రైతులు ఉన్నారు.
గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా దొరక్క రైతులు పీఏసీఎస్‌ల చుట్టూ తిరుగుతున్నారు. వ్యవసాయ పనులు వదులుకుని ప్రైవేట్ వాహనాలు, ఆటోల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల దగ్గరకు వస్తున్నారు.



