ఆంధ్ర ప్రదేశ్

Road Accident: మడకశిరలో ఘోరరోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Road Accident: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. మడకశిర మండలం అగ్రంపల్లి గ్రామ సమీపంలో ఐచర్ వాహనం, బొలెరో గూడ్స్ వాహనాన్ని ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

ఐచర్ వాహన డ్రైవర్ మహమ్మద్ రఫీక్, బొలెరో వాహన డ్రైవర్ వడ్డే రఘుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button