తెలంగాణ
LB Nagar: కారు బీభత్సం.. ముగ్గురికి తీవ్రగాయాలు

LB Nagar: ఎల్బీనగర్ నుంచి కామినేని వైపు వెళ్లే ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం సృష్టించింది. ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగానే యాక్సిడెంట్ అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.