ఆంధ్ర ప్రదేశ్
అదుపు తప్పి లారీ బోల్తా.. తృటిలో తప్పిన ప్రమాదం

కర్నూలు జిల్లాలోని ఆదోని హై వే రోడ్డుపై ప్రమాదం జరిగింద. స్పీరిట్ లిక్విడ్ లోడ్‌తో జిందాల్ ఫ్యాక్టరీకి వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం.
అయితే బోల్తా పడిన లారీ నుండి స్పీరిట్ లిక్ అవుతుండటంతో పేలుడు జరుగుతుందేమో అని భావించిన డ్రైవర్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది వాహనదారులు అటువైపు రాకుండా చర్యలు చేపట్టారు.



