తెలంగాణ
Road Accident: టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి.. గాయాలతో బయటపడ్డ చిన్నారులు

Road Accident: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మంగళపల్లి శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీకొన్న ఘటనలో బసిరెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. తన ఇద్దరు మనవాళ్లను శ్రీనివాస్ కటింగ్ చేయించడానికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలు అయ్యాయి.
మరోవైపు తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం మృతదేహంతో సిద్దిపేట హనుమకొండ ప్రధాన రహదాదిరపై ఆందోళనకు దిగారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో అక్కడికి చేరుకున్న కాజీపేట ఎస్పీ ప్రశాంత్ రెడ్డి ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు బాధితులు.



