ఆంధ్ర ప్రదేశ్
ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

ఏలూరు జిల్లా భీమడోలు మండలంలోని 16వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గుండుగోలు హైవే సమీపంలో రాంగ్ రూట్లో వస్తున్న బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మృతి చెందిన యువకులు ద్వారకాతిరుమ వాసులుగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



