ఆంధ్ర ప్రదేశ్
Eluru: ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

Eluru: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం లైన్ గోపాలపురం వద్ద హైవే పై జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. రాజమండ్రి వైపు నుంచి ఏలూరు వైపు వెళ్తున్న కోళ్లలోడు ఐచర్ వ్యాను లైన్ గోపాలపురం వద్ద ఫ్లై ఓవర్ ఎక్కుతున్న ఇసుకలోడు లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది ఈ ఘటనలో కోళ్ల వ్యాన్ డ్రైవర్, మరొక వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందగా మూడో వ్యక్తి స్వల్పగాయాలు కావడంతో 108వాహనంలో భీమడోలు ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద ఘటన తీవ్రతకు వ్యాన్ ముందర భాగంగా ఛిద్రం కావడంతో క్రైన్ సాయంతో పోలీసులు వాహనాలు విడదీసి డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. భీమడోలు సిఐ విల్సన్ ద్వారకాతిరుమల, భీమడోలు ఎస్ఐ లు సుధీర్, సుధాకర్ లు ఘటనాస్థలానికి చేరుకుని, ట్రాఫిక్ ను నియంత్రించి, మృతుల వివరాలు సేకరిస్తున్నారు.