ఆంధ్ర ప్రదేశ్
Road Accident: కంటైనర్ను ఢీకొట్టిన కారు.. అక్కడిక్కడే ఐదుగురు విద్యార్థులు మృతి

Road Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. మృతులను మేడగం రామిరెడ్డి, శివరాత్రి మహేష్, మెరుపు శ్రీకాంత్, వంగవోలు వాసు, గొడవర్తి యశ్వంత్గా గుర్తించారు. మృతులంతా ఇంజనీరింగ్ సెకండియర్ విద్యార్థులు.



