ఆంధ్ర ప్రదేశ్
Road Accident: కారు బోల్తా.. ఒకరు మృతి.. పలువురికి గాయాలు

Road Accident: కడప జిల్లా బద్వేలు న్యూ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గూడెం – గుంతపల్లి మార్గమధ్యలో ఓ కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. పలువురికి గాయాలు అయ్యాయి. బెంగళూరు నుంచి నెల్లూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



