ఆంధ్ర ప్రదేశ్
ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి

అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిచెరువు కట్టపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడటంతో తొమ్మిది మంది కూలీలు మృతిచెందగా మరో 12 మంది గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలివి రాజంపేట మండలం ఇసుకపల్లి గ్రామ పరిసరాల్లోని తోటల నుంచి మామిడికాయలు కోయడానికి రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట ఎస్టీ కాలనీ, తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం వద్దివేడు, కల్వకుంట్ల ప్రాంతాలకు చెందిన 21 మంది కూలీలు ఆదివారం వచ్చారు. మామిడికాయల లోడుతో రైల్వేకోడూరు మార్కెట్‌కు వెళ్తున్న లారీపై వీరంతా కూర్చున్నారు. లారీ పుల్లంపేట మండలం రెడ్డిచెరువు కట్టపై అదుపుతప్పి బోల్తా పడడంతో కూలీలంతా లోడు కిందపడ్డారు.