తెలంగాణ
Adilabad: ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురి మృతి

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైనథ్ మండలం తరోడ వద్ద కారు అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతులు ఆదిలాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు.



