తెలంగాణ
నిండు గర్భిణీ ప్రాణం తీసిన ఆర్ఎంపీ డాక్టర్

ఆర్ఎంపీ చేసిన వైద్యం వల్ల ఓ నిండు గర్భిణీ మృతి చెందిన సంఘటన నంద్యాల జిల్లాలో సంచలనం సృష్టించింది. నంద్యాల జిల్లా బీరవోలు గ్రామంలో లోకేష్ భార్య అయినా శ్రీవాణి నాలుగు నెలల గర్భిణీ కర్నూలులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో స్కానింగ్ చేయించగా ఆడపిల్ల అని డాక్టర్లు చెప్పారు. రెండు రోజుల క్రితం ఆర్ఎంపీ గీతావాణి శ్రీవాణికి రెండు రోజుల క్రితం అబార్షన్ చేశారు. శ్రీవాణికి అధిక రక్తస్రావంతో బాధపడుతూ మృతి చెందింది.
ఈమెకు ఇద్దరు ఆడ పిల్లలు మూడోసారి గర్భం దాల్చడంతో ఈ దుర దృష్ట సంఘటన జరిగింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా గర్భిణికి అబార్షన్ చేశారు. భర్త ప్రోద్భలంతో అబార్షన్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. భర్త లోకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్ చేసిన వైద్యురాలు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.