క్రీడలు
Rishabh Pant: బౌలింగ్‌లో పంత్‌కు తీవ్ర గాయం.. నొప్పితో విలవిలలాడిన క్రికెటర్
Rishabh Pant: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత బ్యాటర్ రిషభ్ పంత్ గాయపడ్డాడు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ విసిరిన బంతి పంత్ మోచేతిపైన తాకడంతో వెంటనే వాపు వచ్చేసింది. ఆ నొప్పితో పంత్ విలవిలలాడాడు.
బంతి తగిలిన చోట పెద్ద మచ్చలా ఏర్పడింది. వెంటనే సిబ్బంది వచ్చి చికిత్స అందించారు. ఆ తర్వాత పంత్ తిరిగి ఆటను కొనసాగించాడు. 35 ఓవర్ మూడో బంతికి ఇలా పంత్ గాయపడ్డాడు. బంతి బలంగా తాకడంతో వెంటనే స్టార్క్.. పంత్ వద్దకు వచ్చి పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు.