నంద్యాల జిల్లా శ్రీశైలం టోల్‌గేట్ వద్ద రివాల్వర్ కలకలం

నంద్యాల జిల్లా శ్రీశైలం టోల్‌గేట్ వద్ద రివాల్వర్ కలకలం రేపుతోంది. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టగా ఓ వ్యక్తి నుంచి 9 ఎంఎం పిస్టల్ ఒకటి బయటపడింది. దీంతో పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకున్న విచారణ చేపట్టారు. కాగా రివాల్వర్ తీసుకువచ్చిన వ్యక్తిని మధ్యప్రదేశ్ వాసిగా గుర్తించారు శ్రీశైలం ఆలయ అధికారులు. ఆ రాష్ట్రానికి చెందిన సైబర్ క్రైమ్ ఎస్ఐ అని ఆయన పోలీసులకు చెప్పారు. శ్రీశైలం సీఐ ప్రసాద్ రావు ఆ వ్యక్తి వద్ద ఉన్న ఐడీ కార్డు, రివాల్వర్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు నిర్వహించారు.
మధ్యప్రదేశ్ సైబర్ క్రైమ్ ఎస్పీతో సంప్రదించి ఆ వ్యక్తి వివరాలు నిర్ధారించుకున్నారు. విచారణలో అతను నిజంగానే మధ్యప్రదేశ్ సైబర్ క్రైమ్ విభాగంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నట్లు తేలింది. దీంతో పోలీసులు అతని రివాల్వర్, ఐడీ కార్డులను తిరిగి అప్పగించారు. కొద్ది సేపు ఆందోళన కలిగించిన ఈ ఘటనలో ఆ రివాల్వర్ కలిగిఉన్న వ్యక్తి నిజంగానే పోలీసు అధికారి అని తేలడంతో ఆ రివాల్వర్ ఉత్కంఠ వీడినట్టు అయ్యింది. దీంతో, భక్తులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.



