తెలంగాణలో పొలిటికల్ హీట్.. రేవంత్, కేటీఆర్ మధ్య సవాళ్లు

Revanth Vs KTR: వర్షాకాలంలోనూ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ప్రస్తుతం రేవంత్ వర్సెస్ కేటీఆర్‌గా సీన్ మారింది. తాజాగా సీఎం రేవంత్‌కి కేటీఆర్ సవాల్ విసిరారు.
ఇటీవల ఒక బహిరంగ సభలో తమ పాలనలోనే రైతులకు మేలు జరుగుతోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్. అంతేకాదు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు చేసిందేమీలేదన్నారు ఆయన. దీంతో రేవంత్ వ్యాఖ్యలపై మాజీమంత్రి కేటీఆర్ స్పందించారు. రైతులకు ఎవరు ఏం చేశారో చర్చించేందుకు రావాలని ఛాలెంజ్ చేశారు. ఉదయం 11కి సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు రావాలని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో సవాళ్ల సర్వం ఉత్కంఠగా మారింది.
చెప్పినవిధంగానే కాసేపట్లో తెలంగాణ భవన్ నుండి ప్రెస్‌క్లబ్‌కు వెళ్లనున్నారు కేటీఆర్. మరోవైపు కేటీఆర్ స్థాయికి సీఎం రేవంత్ అవసరం లేదు. తామే చర్చకు చాలంటున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే తాము రేవంత్‌తోనే చర్చకు సిద్ధమంటోంది బీఆర్ఎస్. అటు సీఎం రేవంత్ మాత్రం ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు.