తెలంగాణ
Revanth Reddy: తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వండి.. హడ్కో చైర్మన్‌కు సీఎం రేవంత్ విజ్ఞప్తి

Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీరేటుతో రుణాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి హడ్కో ఛైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠ కోరారు. హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ నివాసంలో సంజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హైదరాబాద్ మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, ఫ్యూచర్ సిటీ, తదితర నిర్మాణాలకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై హడ్కో్ ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు. ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని సంజయ్‌ను ఆహ్వానించారు సీఎం రేవంత్.



