తెలంగాణ

Revanth Reddy: ప్రపంచానికే తెలంగాణ రోల్ మోడల్‌గా ఉండాలి

Revanth Reddy: డ్రగ్స్‌ నిర్మూలనలో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమంగా నిలిచిన తెలంగాణకు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలోని 138 దేశాలతో పోటీపడి తెలంగాణ ప్రథమ స్థానం సాధించడంపై సీఎం రేవంత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు.

వివిధ రంగాల్లో ప్రపంచానికి తెలంగాణ రోల్ మోడల్‌గా ఉండాలన్నది తన ఆకాంక్ష అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ గొప్ప విజయాన్ని దేశానికి గర్వకారణంగా పేర్కొన్న సీఎం డ్రగ్స్‌ కట్టడిలో కీలకపాత్ర పోషించిన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌, ఆయన బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button