తెలంగాణ
Revanth Reddy: తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలుపుతాం

Revanth Reddy: ఢిల్లీలో పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 12వ వార్షిక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో సమగ్ర అభివృద్ధి సాధించే లక్ష్యంతో తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047 రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పాలనలో రాజకీయ సంకల్పం ఎంతో అవసరమని, భవిష్యత్ తరాలకు అవకాశాలను కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
దేశంలోనే కొత్త రాష్ట్రమైనప్పటికీ.. తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్కు ఘనమైన చరిత్ర ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ విజన్ డాక్యుమెంట్ ద్వారా కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. ఈ ప్రణాళికలు తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలుపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.



