తెలంగాణ
Revanth Reddy: రేపు మంత్రులతో సీఎం రేవంత్ సమావేశం

Revanth Reddy: రేపు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారిగా సమీక్ష నిర్వహించనున్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వాహణ తేదీలు, అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 42శాతం బిసి రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు.
సొసైటీ పాలకమండళ్లకు ఎన్నికల నిర్వాణపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై మంత్రులతో సీఎం చర్చించనున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరు, బదిలీలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.



