తెలంగాణ

Revanth Reddy: రాహుల్‌, ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ

Revanth Reddy: ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్​ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్​లో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్​ గ్లోబల్​ సమ్మిట్​కు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి, ఆదాయ వృద్ధి లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్​ 2047 విజన్​ డాక్యుమెంట్​ గురించి వివరించి ఆహ్వాన పత్రికను అందించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీలు, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ భేటీలో ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button