ఆంధ్ర ప్రదేశ్
కారు బీభత్సం.. ముగ్గురు మృతి

కాకినాడ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. బైక్, రిక్షాను ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కిర్లంపూడి మండలం సోమవరం దగ్గర కారు టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేరుకుని బాధితులను పరామర్శించారు.



