Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు బెయిల్

Phone Tapping Case: తెలుగు రాష్ర్టల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పాత్రధారిగా అభియోగాలున్న మేకల తిరుపతన్నకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సుమారు 10 నెలల తర్వాత సర్వోన్నత న్యాయస్థానం అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నను గతంలో పోలీసులు అరెస్టు చేశారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అతడు హైకోర్టును ఆశ్రయించగా.. నిరాశే ఎదురైంది. కాగా.. గతేడాది అక్టోబరు 20న హైకోర్టు తీర్పును తిరుపతన్న సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.
వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ కేస్ లో అరెస్ట్ అయ్యిన వారిలో మొదటి వ్యక్తి తిరుపతన్న.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నలుగురిని గత ఏడాదిలో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.. అడిషనల్ ఎస్పీ ప్రణీత్ రావ్, అడిషనల్ ఎస్పీ భుజంగ రావ్, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావ్ లను పోలీసులు అరెస్ట్ చేసారు. దాదాపు 10 నెలలకు పైగా జైల్ లోనే ఉన్నారు.
బయటికి వచ్చేందుకు అనేక సార్లు బెయిల్ పిటిషన్ లు దాఖలు చేసినప్పటికీ రిజెక్ట్ అవుతూ వచ్చాయి. హై కోర్టులో పలుమార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ ఇక్కడ ఊరట లభించలేదు. తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించగా అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.