సినిమా

Retro: రెట్రో ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్

Retro: సూర్య హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న భారీ గ్యాంగ్‌స్టర్ డ్రామా “రెట్రో” సినిమా సందడి మొదలైంది. టీజర్‌తోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు సృష్టించిన ఈ చిత్రం, ఇప్పుడు పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌తో మరింత హైప్‌ను పెంచుతోంది.

లేటెస్ట్ అప్‌డేట్‌లో చిత్ర బృందం సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ నెల 18న గ్రాండ్‌గా ఆడియో లాంచ్‌తో పాటు అవైటెడ్ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయనున్నారు. తమిళనాడులో ఆడియెన్స్‌తో ఈవెంట్‌ను ఘనంగా నిర్వహిస్తుండగా, అదే రోజు సాయంత్రం ట్రైలర్ విడుదల కానుంది. టైమ్ వివరాలు త్వరలో తెలుస్తాయి.

సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో సూర్య నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. తమిళం, తెలుగు భాషల్లో మే 1న “రెట్రో” గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. సూర్య లుక్, కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ యాక్షన్ సీన్స్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేలా కనిపిస్తోంది. మరి, ట్రైలర్ ఎలాంటి రచ్చ సృష్టిస్తుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button