SLBC టన్నెల్‌లో కొనసాగుతోన్న సహాయకచర్యలు

SLBC టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 48 గంటలు గడిచినా 8 మంది సిబ్బంది ఆచూకీ లభించడం లేదు. టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది సిబ్బందిని బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. లోకోట్రైన్ రాకపోకలకు 9వ కిలోమీటర్ వద్ద అంతరాయం కల్గింది. అయితే మరమ్మతులు చేసి సమస్యను పరిష్కరించేందు కు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అలాగే టన్నెల్‌లో 11వ కిలోమీటర్ నుంచి 2కిలోమీటర్ల మేర నీరు భారీగా నిలిచింది. రెండు పంపింగ్ స్టేషన్ల మధ్య నీళ్లు నిలిచినట్లు సిబ్బంది చెబుతోంది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా పంపులు తెప్పించి సిబ్బంది డీవాటరింగ్ చేస్తోంది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అర్ధరాత్రి టీబీఎంలోకి ప్రవేశించింది. వంద మీటర్ల మేర బురదను దాటి టీబీఎంలోకి ప్రవేశించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక పేరుకుపోయిన మట్టిని తీస్తే.. మళ్లీ కూలే ప్రమాదం ఉందా అనేదానిపై సమీక్షిస్తున్నారు.