తెలంగాణ
SLBC Tunnel: టన్నెల్ లోకి వెళ్లిన రోబోటిక్ నిపుణుల బృందం

SLBC Tunnel: ఉదయం నలుగురు సభ్యులతో కూడిన అన్వి రోబోటిక్ నిపుణుల బృందం టన్నెల్‌లోకి వెళ్లిందన్నారు. రోబోటిక్ నిపుణులతో పాటు ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ కూడా టన్నెల్ లోకి వెళ్లి పరిశీలించారు. నిన్న కూడా ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ టన్నెల్ లోపల పరిసరాలను పరిశీలించారు.
బయటి నుండి ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా సమాచారం తెలుసుకుని సిబ్బందికి అసరమైన సమాచారం ఇస్తున్నారు డిజాస్టర్ మేనేజ్ మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్. టన్నెల్ లోపల బ్యాటరీ సమస్య, రోజ్ కట్టర్ అవసరమని సమాచారం అందిన వెంటనే లోకో మోటర్ పంపించారు. ఇప్పటికే క్యాడవర్ డాగ్స్ కనిపించకుండా పోయిన కూలీల కోసం అన్వేషిస్తున్నాయి.