ఆంధ్ర ప్రదేశ్
Kurnool Bus Accident:ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు నుంచి మృతదేహాలను సిబ్బంది బయటకు తీస్తున్నారు. ప్రమాదంలో ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. మృతదేహాలు మడిమసి కావడంతో ఘటనా స్థలంలోనే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా మృతదేహాల గుర్తించనున్నారు. డీఎన్‌ఏ పరీక్షల తర్వాత మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.



