వ్యాపారం

RBI: మధ్యతరగతి ప్రజలకు ఆర్బీఐ గుడ్ న్యూస్.. లోన్ తీసుకున్న వారికి ఊరట

RBI: మధ్యతరగతి ప్రజలకు,లోన్ తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. కీలకమైన రెపో రేటు పై ఆర్బీఐ గవర్నర్ ప్రకటన చేశారు. రిజర్వ్ బ్యాంక్ తన కీలక రెపో రేటును 5.25 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడంతో పాటు, అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల ఏర్పడే ఆర్థిక ఒడిదుడుకులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల హోమ్ లోన్, కార్ లోన్ , పర్సనల్ లోన్ తీసుకున్న వారికి తక్షణమే ఈఎంఐల భారం పెరగదు. ఇప్పటికే ఉన్న వడ్డీ రేట్లు అలాగే కొనసాగుతాయి. అయితే ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరితే భవిష్యత్తులో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ సూచించారు. తాజా నిర్ణయంతో బ్యాంకింగ్ రంగం స్థిరంగా ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button