పల్నాడు జిల్లా వినుకొండలో అక్రమ నిర్మాణాల తొలగింపు

పల్నాడు జిల్లా వినుకొండలో అక్రమ నిర్మాణాలు తొలగించారు రెవెన్యూ అధికారులు. వెల్లటూరు గ్రామంలో హైకోర్టు ఆదేశాలతో ఆక్రమణలు తొలగించారు. మల్లీఖార్జున శర్మ తన పొలానికి వెళ్లేదారిలో R&B రోడ్డు ఆక్రమణలకు గురైందని జిల్లా కలెక్టర్ పల్నాడు వారికి గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో R&B అధికారులు విచారణ జరిపి ఆక్రమణ నిజమేనని నిర్థారించి ఆక్రమణలు తొలగించాలని రెవెన్యూ శాఖను కోరినట్లు తెలిపారు. దీంతో ఆక్రమణల తొలగింపుకు నోటీసులు జారీ చేశామన్నారు.
ఆ ఆక్రమణల తొలగింపులో జాప్యం వల్ల ఫిర్యాదుదారు రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ వేసినందుకు హైకోర్టు స్పందించింది. ఆక్రమణలు మూడు నెలల్లో తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు కూల్చివేతలు తాత్కాలికంగా నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ ప్రక్రియ అంతా న్యాయస్థానం చెప్పినట్లుగానే చేశామని ఎవరి ప్రోద్బలం లేదని తహసీల్దార్ వెల్లడించారు.



