పవర్ స్టార్ ‘హరిహర వీరమల్లు’ కి రికార్డ్ బిజినెస్..!

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం బిజినెస్ విషయంలో క్రేజీ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయ్..
పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ రూపొందిస్తున్న ‘హరిహర వీరమల్లు’ భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా రిలీజ్ వాయిదాలతో సతమతమవుతున్నా, బిజినెస్ టాక్ మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం రూ.140 కోట్ల బిజినెస్ చేసినట్టు టాక్. ఒక్క ఆంధ్రాలోనే రూ.100 కోట్ల మార్క్‌ను తాకినట్టు సమాచారం.
అయితే, ఈ భారీ అంచనాలను సినిమా అందుకోగలదా అన్నది ప్రశ్న! వాయిదాల వల్ల కొంతమంది పవన్ ఫ్యాన్స్‌లో ఆసక్తి తగ్గినట్టు కనిపిస్తోంది. దీంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందన్నది ఆసక్తికరం. ‘హరిహర వీరమల్లు’ తన క్రేజ్‌తో ఈ టార్గెట్‌ను ఛేదిస్తాడా? లేక అంచనాలకు దూరంగా నిలుస్తాడా? వేచి చూడాలి.