ఆంధ్ర ప్రదేశ్
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ప్రారంభమైన రీపోలింగ్

కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా రెండు కేంద్రాల్లో రీపోలింగ్ కొనసాగుతుంది. . 3, 14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్‌లో అక్రమాలు, రిగ్గింగ్ ఆరోపణల కారణంగా, రెండు పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఓటర్లు మరోసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. భారీ బందోబస్తు, వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు ఈనెల 14న కడపలో జరుగనుంది. ఈ ఎన్నికలు వైఎస్ జగన్ కంచుకోటలో రాజకీయ ప్రతిష్టకు కీలకంగా ఉన్నాయి. 3, 14 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం వెయ్యి మంది ఓటర్లు ఉన్నారు.



