రాయుడు హత్య కేసులో సంచలన విషయాలు

శ్రీకాళహస్తి డ్రైవర్ రాయుడు హత్య కేసు దర్యాప్తు స్పీడప్ అయింది. ఇందులో భాగంగా చెన్నై సీపీ అరుణ్ కీలక విషయాలు వెల్లడించారు. డ్రైవర్‌ని చంపింది వినుత దంపతులేనన్నా రు. ఆంధ్రాలో హత్య చేసి చెన్నైకి తరలించినట్లు చెప్పారు. హత్యలో ఉపయోగించిన కారు సీజ్ చేశామన్న సీపీ.. సీసీ ఫుటేజీ ద్వారా కీలక ఆధారాలు గుర్తించినట్లు వెల్లడించారు.
రాయుడు హత్య కేసులో భాగంగా నిందితులను చెన్నైలోని పులాల్ జైలుకు తరలిస్తుండగా వినుత సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ అరెస్ట్ వెనక కుట్ర దాగి ఉందన్నారు. హత్యలో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిదే పాత్ర ఉందని ఆరోపించిన వినుత బయటకి వచ్చాక ఎవ్వరినీ వదిలిపెట్టనన్నారు.
నిందితురాలు వినుత వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు. రెండు వాహనాల్లో మృతదేహాన్ని తరలించారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు శవరాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసే ఉంటాయన్నారు సుధీర్ రెడ్డి.