సినిమా
Ravi Teja: డొంకరాయి లో సినీ రవితేజ సందడి

Ravi Teja: అల్లూరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం పోల్లూరు డొంకరాయి పరిసర ప్రాంతాలలో హీరో రవితేజ సందడి చేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరో రవితేజకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను డొంకరాయి గ్రామంలో చిత్రీకరించారు. తదుపరి 20 రోజుల షూటింగ్‌కు సంబంధించి శివాలయం వద్ద సెట్స్ వేశారు. గ్రామానికి రవితేజ రవడంతో.. పరిసర ప్రాంతాల ప్రజలు ఆయనను చూసేందుకు వస్తున్నారు.



