సినిమా
Mass Jathara Trailer: రవితేజ ‘మాస్ జాతర’ ట్రైలర్ వచ్చేసింది

Mass Jathara Trailer: రవితేజ్, శ్రీలీల జోడీగా రూపొందిన ‘మాస్ జాతర’ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. దీంతో రవితేజ్ అభిమానుల్లో బజ్ క్రియేట్ అయింది. దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన ‘మాస్ జాతర’ చిత్రం ట్రైలర్ ఆలస్యమైనా అదిరిపోయింది. రవితేజ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నిండిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకర్షించింది.
శ్రీలీలతో జోడీ కట్టిన రవితేజ మరోసారి మాస్ ఎంటర్‌టైనర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణం వహించింది. అక్టోబర్ 31న పైడ్ ప్రీమియర్స్‌తో ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ట్రైలర్ విడుదలతో రవితేజ అభిమానుల్లో హైప్ మరింత పెరిగింది. ఈ చిత్రం రవితేజకు మరో హిట్ ఇస్తుందన్న ఆశలు కనిపిస్తున్నాయి.



