సినిమా

Ravi Teja: రవితేజ సినిమా వాయిదా?

Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ మరో మాస్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు! భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. కానీ, సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఎందుకు ఈ ఆలస్యం? ప్రమోషన్స్ ఎందుకు ఆగాయి? తెలుసుకుందాం.

రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భాను భోగవరపు దర్శకత్వంలో, సితార నాగవంశీ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ధమాకా తర్వాత ఈ జోడీ మళ్లీ కలవడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఈ నెల 27న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం.

పోస్ట్-ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడం, ప్రమోషన్స్ ఆలస్యం కావడం దీనికి కారణమని తెలుస్తోంది. టీజర్‌లో రవితేజ ఎనర్జీ ఆకట్టుకున్నా, కథలో కొత్తదనం లేకపోవడంతో బజ్ తగ్గిందని టాక్. నిర్మాత నాగవంశీ ఇటీవల కింగ్‌డమ్, వార్ 2 చిత్రాలతో నిరాశపడడంతో, ఈ సినిమాను సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button