సినిమా
Mass Jathara: మాస్ జాతర విడుదల వాయిదా?

Mass Jathara: రవితేజ హీరోగా తెరకెక్కిన మాస్ జాతర సినిమా రిలీజ్‌పై కొత్త బజ్ వినిపిస్తోంది. ఆగస్ట్ 27న విడుదల కావాల్సిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడినట్లు సమాచారం. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మాస్ మహారాజ్ రవితేజ, శ్రీలీల జంటగా దర్శకుడు బాను భోగవరపు తెరకెక్కిస్తున్న మాస్ జాతర చిత్రం మొదటి నుంచీ అంచనాలు రేపుతోంది. మే 9న విడుదల కావాల్సిన ఈ సినిమా ఆగస్ట్ 27కి వాయిదా పడింది. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఈ డేట్ నుంచి కూడా సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
దసరా సీజన్‌లో, అంటే అక్టోబర్ మొదటి వారంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.