Mass Jathara: మాస్ జాతర ఎలా ఉంది?

Mass Jathara: మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న ప్రీమియర్లతో విడుదలైంది. దర్శకుడు భాను మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం భారీ అంచనాలు రేకెత్తించింది. రవితేజ హిట్ సాధించాడా అన్నది ప్రేక్షకుల్లో చర్చనీయాంశమైంది.
రవితేజ హీరోగా భాను దర్శకత్వంలో వచ్చిన మాస్ జాతర సినిమా రొటీన్ కథతో సాగినప్పటికీ ఆకర్షణీయంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. నాగవంశీ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం రైల్వే పోలీస్ అధికారిగా రవితేజను చూపించింది. అన్యాయాన్ని ఎదిరించే కథాంశం పాతబడినదైనా ఫైట్ సీక్వెన్స్‌లు ఆకట్టుకున్నాయి. రవితేజ వన్ మ్యాన్ షోగా నడిపించాడు. కామెడీ, డ్యాన్స్, యాక్షన్‌లలో ఇరగదీశాడు. శ్రీలీల పాత్ర పరిమితమైనా కీలకం.
నవీన్ చంద్ర విలన్‌గా మెరిశాడు. హైపర్ ఆది, అజయ్ ఘోష్ కామెడీ కొంతవరకు నవ్వించింది. రాజేంద్రప్రసాద్ పాత్ర ఆసక్తికరంగా ఉంది. భీమ్స్ songs బాగున్నాయి. అయితే నేపథ్య సంగీతం సాధారణంగా ఉంది. సినిమాటోగ్రఫీ రంగురంగులగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా ఇది యాక్షన్ ప్రియులకు మాత్రమే నచ్చే చిత్రంగా నిలిచింది.



