రవితేజ కూతురు సినీ ఎంట్రీకి రెడీ!

మాస్ మహారాజ రవితేజ కుమారుడు మహధాన్, కుమార్తె మోక్షద ఇద్దరూ సినీ రంగంలో అడుగుపెడుతున్నారు. మహధాన్ ‘స్పిరిట్’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, మోక్షద రవితేజ తదుపరి చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
వాయిస్ ఓవర్:
మాస్ మహారాజ రవితేజ ఇద్దరు పిల్లలు సినీ రంగంలో తమదైన మార్క్ చూపేందుకు సిద్ధమవుతున్నారు. కుమారుడు మహధాన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘స్పిరిట్’లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. సందీప్ వంగా వంటి టాప్ డైరెక్టర్ వద్ద పనిచేస్తూ దర్శకత్వ మెళకువలు నేర్చుకుంటున్నాడు. ఇక కుమార్తె మోక్షద తండ్రి రవితేజ నెక్స్ట్ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారు.
ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ రూపొందిస్తున్నాడు. నటుడిగా కాకుండా తెరవెనుక బాధ్యతలు చేపట్టి సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ ఇద్దరు వారసులను ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. రవితేజకి సూపర్ స్టార్‌డమ్ ఉన్నప్పటికీ తమ సొంత ప్రతిభతో రాణిస్తామని నిరూపించుకోవాలన్న ఆలోచనే ఈ ఇద్దరిలోనూ కనిపిస్తోంది.



