తెలంగాణ
విద్యార్థులపై ఎలుకల దాడి

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బీసీ హాస్టల్‌లో ఎలుకలు స్వైరవిహారం చేస్తున్నాయి. పలువురు విద్యార్ధులపై ఎలుకలు దాడి చేశాయి. ఎలుకల దాడిలో 10 మంది విద్యార్ధులు గాయపడ్డారు. విద్యార్ధులను చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్లాస్ రూమ్‌లో ఎలుకల స్వైర విహారంతో స్టూడెంట్స్ భయాందోళనకు గురైతున్నారు.
విద్యార్ధులను స్కూల్‌కు పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. ఎలుకలు కరవకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామని ప్రిన్సిపల్ రాణి తెలిపారు. స్కూల్ బిల్డింగ్ పక్కన చెత్త చెదారం, రైస్ మిల్ ఉండటంతో ఎలుకలు ఎక్కువగా వస్తున్నాయని ప్రిన్సిపల్ తెలిపారు.