సినిమా
Rashmika: వీల్‌ఛైర్‌లో రష్మిక.. వీడియో వైరల్
Rashmika: జిమ్‌లో వర్కౌట్లు చేస్తుండగా కాలికి గాయమైందని స్టార్ హీరోయిన్ రష్మిక ఇటీవలె తన అభిమానులకు తెలిపింది. అయితే తాజాగా ఆమె హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. స్టాఫ్ సాయంతో ఆమె చాలా ఇబ్బందిగా నడుచుకుంటూ వీల్‌ఛైర్ ఎక్కి ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లింది. ఆ సమయంలో ముఖం కనిపించకుండా మాస్క్ పెట్టుకుని, తలకు క్యాప్‌తో దర్శనమిచ్చారు.
అయితే ఆమె తన అప్‌కమింగ్ మూవీ ప్రమోషన్స్ కోసం ముంబయి బయల్దేరినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రష్మిక త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక ‘ఛావా’ సినిమాలో నటించారు. ఫిబ్రవరి 14న విడుదల కాబోతుంది.