చరిత్ర సృష్టించిన రష్మిక?

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మరోసారి అంతర్జాతీయ వేదికపై సందడి చేయనుంది. జపాన్‌లోని టోక్యోలో జరగనున్న క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ 2026లో ప్రజెంటర్‌గా వ్యవహరించబోతున్నారు. ఈ అవకాశాన్ని అందుకున్న మొట్టమొదటి భారతీయ నటిగా ఆమె చరిత్ర సృష్టించింది. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
రష్మిక మందన్న తన అందం, అభినయంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగింది. పుష్ప, యానిమల్, ఛావా వంటి చిత్రాలతో బాక్సాఫీస్ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. తాజాగా జపాన్‌లో మే 23న జరగనున్న క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ 2026లో ప్రజెంటర్‌గా ఆహ్వానం అందుకుంది. 2024లో కూడా ఈ అవార్డ్స్ వేడుకల్లో ప్రజెంటర్‌గా పాల్గొన్న ఆమె ఇప్పుడు వరుసగా రెండుసార్లు ఈ వేదికపై కనిపించనుంది. రష్మికను క్రంచీరోల్ సంస్థ ‘ఇండియా స్వీట్ హార్ట్’గా అభివర్ణించింది. వివాహితగా మారిన తర్వాత భర్త విజయ్ దేవరకొండతో కలిసి ‘రణబాలి’ సినిమా చేస్తున్నారు. ‘మైసా’ సినిమాలో కూడా నటిస్తున్న రష్మిక.. కెరీర్ పరంగా బిజీగా ఉంది.



