సినిమా

Virosh Reception: ఘనంగా విజయ్‌- రష్మిక రిసెప్షన్‌

Virosh Reception: విజయ్‌ దేవరకొండ – రష్మిక వెడ్డింగ్‌ రిసెప్షన్‌ ఘనంగా జరిగింది. సంప్రదాయ దుస్తుల్లో విరోష్‌ జోడీ మెరిసింది. చేతిలో చెయ్యి వేసుకుని ఎంట్రీ ఇచ్చిన ఈ జంట.. అతిథులను ఆప్యాయంగా పలకరించారు. రిసెప్షన్‌కు సినీ, రాజకీయ తదితర రంగాల ప్రముఖులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీత, భారత రాష్ట్రసమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ దంపతులతో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, టాలీవుడ్‌ నుంచి చిరంజీవి, వెంకటేశ్‌, అక్కినేని నాగార్జున దంపతులు, నాగచైతన్య, రామ్‌చరణ్‌ దంపతులు, నాని కుటుంబం, నవీన్‌ పొలిశెట్టి, దర్శకుడు సుకుమార్‌ ఫ్యామిలీ, నిర్మాత దిల్‌రాజు ఫ్యామిలీ, నమ్రతా శిరోద్కర్‌, రాధిక- శరత్‌కుమార్‌ దంపతులు హాజరయ్యారు. విజయ్‌- రష్మిక వివాహం ఫిబ్రవరి 26న జరిగిన సంగతి తెలిసిందే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button