సినిమా

విజయ్-రష్మిక మళ్లీ దొరికేశారు.. డేటింగ్ రూమర్లకు బలం

Rashmika Mandanna -Vijay Deverakonda: టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మరోసారి వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే రూమర్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నా క్లారిటీ ఇవ్వకుండా దొరికిపోతూనే ఉన్నారు. తాజాగా ఒమన్ బీచ్‌లో ఇద్దరూ వేర్వేరుగా ఫొటోలు పోస్ట్ చేయగా నెటిజన్ల కళ్లు మాత్రం గప్చుప్ అన్నట్లుగా ఉన్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఏప్రిల్ 5న రష్మిక తన బర్త్‌డే సెలబ్రేట్ చేసేందుకు ఒమన్ వెళ్లింది. అక్కడి బీచ్‌లో సింగిల్ ఫొటోలు షేర్ చేసింది. మరుసటి రోజే విజయ్ దేవరకొండ అదే బీచ్‌లో గుర్రపు స్వారీ, నడుస్తూ ఉన్న ఫొటోలను పోస్ట్ చేశాడు. ఇద్దరి ఫొటోల బ్యాక్‌గ్రౌండ్ సేమ్‌గా కనిపించడంతో రష్మిక బర్త్‌డే కోసం విజయ్ అక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో మాల్దీవ్స్, రెస్టారెంట్లలోనూ ఇలాగే దొరికిన ఈ జంట మళ్లీ నెటిజన్ల చేతిలో చిక్కారు. వీరిపై “ఇంకెన్నాళ్లు ఇలా దాస్తారు? పెళ్లెప్పుడు?” అంటూ ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి. వీరి రిలేషన్‌షిప్‌పై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button