జాతియం
Bihar: రసగుల్లా కోసం గొడవ.. ఆగిన పెళ్లి

Bihar: వివాహ విందులో రసగుల్లా అందలేదన్న చిన్న విషయంతో మొదలైన గొడవ.. చిలికి చిలికి గాలివానలా మారి కొట్టుకునే వరకు వెళ్లింది. రెండు కుంటుంబాలకు చెందిన బంధువులు ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకుంటూ, పిడిగుద్దులు కురిపించుకుంటూ ఘర్షణకు దిగారు.
ఈ ఘటనతో వివాహం అర్ధాంతరంగా ఆగిపోయింది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. వరుడి కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. బీహార్‌లోని బోథ్ గయలో ఘటన జరిగింది.



