సినిమా

RAPO22: రామ్ పోతినేని RAPO22 నుంచి టైటిల్ గ్లింప్స్..!

RAPO22: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ RAPO22 గురించి సూపర్ హాట్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.

రామ్ పోతినేని నటిస్తున్న RAPO22 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు పి.మహేష్ బాబు రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మేకర్స్ సాలిడ్ సర్‌ప్రైజ్‌తో రెడీ అయ్యారు. మే 15న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.

రామ్ సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోనున్న ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారనే ఆసక్తి నెలకొంది. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బొర్సె నటిస్తుండగా, వీరి కెమిస్ట్రీ సినిమాకు హైలైట్ కానుంది. మెర్విన్-వివేక్ సంగీతం సమకూరుస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. టైటిల్ గ్లింప్స్‌తో ఈ సినిమా హైప్ మరింత పెరగనుంది. రామ్ ఈసారి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాడా? వేచి చూద్దాం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button