News
Medchal: మేడ్చల్ రైల్వే స్టేషన్లో దారుణం.. యువతిపై అత్యాచారయత్నం

Medchal: మేడ్చల్ జిల్లా కేంద్రంలో దుండగులు అరాచకం సృష్టించారు. ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. మేడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన లో కీచకులను రాళ్లతో కొట్టి యువతి తప్పించుకుంది. అనంతరం మేడ్చల్ పీఎస్లో ఫిర్యాదు చేసింది యువతి. ఘటనపై విచారించిన మేడ్చల్ పోలీసులు కేసును రైల్వేశాఖకు ట్రాన్స్ఫర్ చేశారు. అత్యాచార ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.