‘రణ కుంభ’తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వారణాసి!

Varanasi: రాజమౌలి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న వారణాసి సినిమా నుంచి రణ కుంభ ఆడియో సాంగ్ విడుదలైంది. పృథ్వీరాజ్ పాత్రను పరిచయం చేస్తూ వచ్చిన ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కీరవాణి సంగీతం అద్భుతంగా ఉంది.
ఎస్ఎస్ రాజమౌలి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న భారీ చిత్రం వారణాసి. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఇటీవల జరిగిన అనౌన్స్మెంట్ ఈవెంట్లో పృథ్వీరాజ్ పోషిస్తున్న కుంభ పాత్రను పాట రూపంలో పరిచయం చేశారు. ఇప్పుడు ఆ రణ కుంభ పాటను అధికారికంగా ఆడియో సాంగ్‌గా విడుదల చేశారు.
ఎంఎం కీరవాణి అందించిన సంగీతం అద్భుతంగా ఉండగా, బీట్స్, లిరిక్స్ పృథ్వీరాజ్ పాత్ర రేంజ్‌ను సూచిస్తున్నాయి. ఇందులో ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో కనిపిస్తుండగా, సూపర్ స్టార్ మహేష్ బాబు రుద్రగా తాండవం చేయనున్నారు. 2027 సమ్మర్లో ఈ భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.



