తెలంగాణ
Ramzan celebrations: అల్వాల్ మచ్చ బొల్లారంలో రంజాన్ వేడుకలు

Ramzan celebrations: అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ లోని ఈద్గా లో ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ లో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొనీ ప్రత్యేక ప్రార్థనలు చేసారు. ఈ సందర్భంగా మత గురువు రంజన్ పండుగ ప్రత్యేకతను వివరించారు. ప్రార్థన అనంతరం ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా అల్వాల్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాసరెడ్డి ,మాజీ కౌన్సిలర్ డోలి రమేష్ ఈద్గా వద్ద మైనార్టీ సోదరులకు ప్రత్యేక రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత గురువు ఇంతియాజ్ అహ్మతి ముఫ్తీ, గ్రేవియార్డ్ మస్జిద్ అధ్యక్షుడు అతిక్ పాషా ఖాద్రి, రహ్మాత్ ఖాన్, ఆరీఫ్ మరియు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు