Ramayana: షాకిస్తున్న రామాయణం బడ్జెట్!

Ramayana: బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న రామాయణం సినిమా బడ్జెట్ వివరాలు బయటకు వచ్చాయి. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. నిర్మాత నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో అంచనాలు పెంచారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న రామాయణం సినిమా భారీ అంచనాల మధ్య రూపొందుతోంది.
నితీష్ తివారీ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం భారత సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా నిలవనుంది. నిర్మాత నమిత్ మల్హోత్రా రెండు భాగాల కోసం రూ.4000 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ఇండియన్ సినిమా రంగంలో ఊహించని స్థాయిలో ఉంది. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్టింగులతో ప్రేక్షకులకు విజువల్ వండర్‌గా రామాయణం అందనుంది. 2026 దీపావళికి మొదటి భాగం విడుదల కానుంది. ఈ బడ్జెట్ వార్తలు నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తాయి.