రామ్‌తో సినిమా ఖాయమే.. అనిల్ రావిపూడి సూపర్ కాన్ఫిడెంట్!

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేనితో హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబో మళ్లీ సెట్ కానుంది. గతంలో ‘రాజా ది గ్రేట్’ మిస్ అయిన ఈ జోడీపై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి ‘ఎప్పుడొస్తుందో తెలియదు కానీ బద్దలవుతుంది’ అని చెప్పడంతో రామ్ ఫ్యాన్స్ ఎగిరిగంతేస్తున్నారు
టాలీవుడ్‌లో మరో మాస్ కాంబినేషన్ సిద్ధమవుతోంది. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కలయిక త్వరలోనే రూపొందనుంది. గతంలో ‘రాజా ది గ్రేట్’లో రామ్ హీరోగా ఫిక్స్ అయి తరువాత కొన్ని కారణాల వల్ల తప్పుకోగా, ఆ స్థానంలో రవితేజ వచ్చి బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. అంతకుముందు ‘కందిరీగ’ సినిమాలో కూడా అనిల్ రావిపూడి అసిస్టెంట్‌గా పనిచేశాడు.
ఇప్పుడు చిరంజీవితో ‘మన శంకరవరప్రసాద్ గారు’ పూర్తయ్యాక అనిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రామ్‌తోనే ఉంటుందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి స్పందిస్తూ ‘మా ఇద్దరి కాంబోలో సినిమా ఎప్పుడు వచ్చినా బద్దలవుతుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. ఈ మాటలు రామ్ ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తాయి. ప్రస్తుతం వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న రామ్ నవంబర్ 27న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’తో హిట్ కొట్టాలని కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.



